స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మేళలో విశేష స్పందన

viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని, పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ పేదరిక నిర్మూల సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో స్థానిక స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో రాగి జావ,జొన్న జావ,మినప వడలు, పచ్చళ్ళు, చీరలు,మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్, జనరల్ స్టోర్ ఉత్పత్తులు వంటి అనేక వస్తువులు ప్రదర్శించబడ్డాయి.ఈ మేళ ద్వారా మహిళల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే ఉత్పత్తులకు విస్తృతమైన ప్రాధాన్యత లభించింది.స్థానిక ప్రజలు పాల్గొని ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళలకు స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, తాజా మాజీ కౌన్సిలర్ మ్యాకల కాంతారావు,మాజీ కో-ఆప్షన్ సభ్యులు పిప్పోజి మహేందర్ బాబు,మున్సిపల్ మేనేజర్ వెంకటి,మెప్మా టిఎంసి శరణ్య,మెప్మా ఆర్పీలు,మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



