కథలాపూర్
ప్రభుత్వ విఫ్ & ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో పంట పొలాలకు నీటిని విడుదల చేసిన అధికారులు

viswatelangana.com
March 18th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం ఉట్పల్లి, పెగ్గర్ల, దుంపేట, దూలూరు గ్రామాలలో పంట పొలాలు ఎండిపోతున్నాయని స్థానిక రైతులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు విన్నవించారు. సోమవారం విప్ ఆదేశాల మేరకు పంట పొలాలు ఎండిపోకుండా అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



