రాయికల్

కుమ్మరి పెల్లి విద్యార్థుల ప్రతిభ

viswatelangana.com

April 21st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో సమగ్ర శిక్షా మరియు రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల 3,4,5 వ తరగతులకు, ఉన్నత పాఠశాలల 8,9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలలో పాల్గొన్న రాయికల్ మండల కుమ్మరిపెల్లి పాఠశాల విద్యార్థులు షేక్ హమీద్ ద్వితీయ స్థానం, గుమ్మడి అక్షిత్ తృతీయ స్థానం సాధించి జిల్లా విద్యాధికారి రాము చేతుల మీదుగా మెడల్, జ్ఞాపిక మరియు సర్టిఫికెట్లను అందుకోవడం జరిగింది. వీరు ఈ నెల 19న మండల స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీలో ప్రతిభ చూపి ఈరోజు జరిగిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు, ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్, ఉపాధ్యాయులు బెజ్జంకి హరికృష్ణ, కడకుంట్ల వినోద్ కుమార్ లు అభినందించారు.

Related Articles

Back to top button