కథలాపూర్
బీజేవైఎం ఆధ్వర్యంలో ఎస్సైకి వినతిపత్రం అందజేత

viswatelangana.com
June 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలకేంద్రంలో గల బీజేవైఎం నాయకులు బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా గోవులను తరలించకుండా మండల సరిహద్దు గ్రామమైన కలికోట శివారులో వెంటనే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో కథలాపూర్ ఎస్ఐకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి, మండల ప్రధాన కార్యదర్శి గండ్ర విజయ్ రావు, బీజేవైఎం జిల్లా నాయకులు కాసోజి ప్రతాప్, బీజేవైఎం నాయకులు అల్గోట్ ప్రమోద్, మల్యాల శ్రీకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



