viswatelangana.com
Date of Publish : 24 October 2024, 4:15 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ పై అవగాహన శిబిరం (నెరెళ్ల)

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి ఐరన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ పైన అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎండి సమీయుద్దీన్ మాట్లాడుతూ మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఐదు గ్రాముల అయోడైసిడ్ సాల్ట్ ఉండేటట్లు చూసుకోవాలని లేనిచో వాటి వలన చాలా దుష్ప్రభావాలకు లోను కావాల్సి ఉంటుందని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ ఫర్ ఎన్ సి డి డాక్టర్ అర్చన మాట్లాడుతూ అయోడిన్ లోపం వలన గర్భస్రావం, మృత శిశు జననం, అసంపూర్ణ పిండ మెదడు అభివృద్ధి, తక్కువ మానసిక మరియు శారీరక పెరుగుదల, గాయిటర్, తక్కువ ప్రజ్ఞ లబ్ధి స్థాయి అనగా బుద్ధి మాంధ్ద్యత, మరుగుజ్జు తనం మరియు తక్కువ అభ్యసన సామర్ధ్యాలు వస్తాయని అందుకే తప్పనిసరిగా ఆహారం లో అయోడిన్ వాడవలనని సూచించారు. అయోడిన్ థైరాయిడ్ గ్రంథిలో కీలకంగా వ్యవహరించి టి3, టి4 మరియు థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ లను స్రవించడంలో తోడ్పాటు అందిస్తున్నామని, కావున ప్రజలందరూ అవగాహన పెంచుకొని అయోడిన్ లోపం వలన కలిగే దుష్ప్రభావాల నుండి కాపాడుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎండి సమీయుద్దీన్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అర్చన వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Change News Type