రాయికల్

ఆర్థిక సాయం

viswatelangana.com

April 15th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామజీపేట్ గ్రామానికి చెందిన పలువురి కుటుంబాలకు దుబాయ్ వారధి సంఘం అండగా నిలిచింది. గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశంకి వెళ్లి కన్న ఉరికి సాయం చేయాలనే తపనతో సంఘం గా ఏర్పడి పలువురి కుటుంబాలకు,గ్రామానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. కాగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామానికి చెందిన మైస ప్రశాంత్, మారంపెల్లి బాజయ్య అనే యువకులు మృతి చెందడంతో వారి కుటుంబానికి దుబాయ్ వారధి సంఘం సభ్యులు అండగా నిలిచారు. వారి కుటుంబ సభ్యులకు తలో 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కాగా గ్రామంలో సేవ, ఆద్యాత్మిక కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న దుబాయ్ వారధి సంఘం సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దసమందం వెంకటేశ్వర్లు, వాసరి రవి, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, మాజీ ఉప సర్పంచ్ ఆర్మూరి నరేందర్, దుబాయ్ వారధి సంఘం సభ్యులు తోకల నరేష్, న్యవనంది రాజ్ కుమార్, న్యావనంది రవి, న్యావణంది రమేష్, తొట్లె విష్ణు, జుంబర్థి వసంత్ నాయకులు సుద్దాల నర్సయ్య, డీలర్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button