viswatelangana.com
Date of Publish : 06 April 2024, 4:56 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రీ స్కూల్ అన్యువల్ డే సెలబ్రేషన్స్

డి ఎస్ జగిత్యాల ప్రాజెక్ట్ రాయికల్ మండల ఇటిక్యాల సెక్టర్ లోని ధావన్ పల్లి అంగన్వాడి సెంటర్ నందు ప్రీస్కూల్ అన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా గర్భిణీలకు బాలింతలకు సున్నా నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు మరియు తల్లులకు ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి మరియు ఈవెంట్స్ గురించి తెలియజేయడం జరిగింది. మరియు అసెస్మెంట్ కార్డుల గురించి వివరించడం జరిగింది అలాగే అభివృద్ధి సృజనాత్మక కథలు ప్రీస్కూల్ యాక్టివిటీస్ గురించి వివరించడం జరిగింది.. మరియు పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రోజా మరియు ఆయమ్మ అమృత అలాగే పిల్లలు తల్లులు బాలింతలు ఇతరులు పాల్గొన్నారు.

Change News Type