ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన కూన గోవర్ధన్

viswatelangana.com
నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులుగా బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, సాజిద్ పాషా, కోశాధికారి ఎస్.కె మక్సుద్ సహాయ కార్యదర్శులు పింజరి శివ, పి. శశికాంత్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎం.డి సమియోద్దీన్, కార్యవర్గ సభ్యులు ముత్యాల రమేష్, మహమ్మద్ అఫ్రోజ్, షేక్ రఫీ ఉల్లా, సిరికొండ సాగర్, పానిగంటి మహేందర్, బాసెట్టి హరీష్, కుర్ర రాజేందర్, యానం రాకేష్ కుమార్, యస్.డి సోహెల్, ఎం.డి హైమద్ లను ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మార్కెట్ కమిటీ చైర్మన్ కున గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సమస్య పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వం వారధిగా ఉంటూ ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాష, సేవదల్ రాష్ట్ర కార్యదర్శి అందే మారుతి, జిల్లా మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



