viswatelangana.com
Date of Publish : 17 April 2025, 1:51 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్లాస్టిక్ వాడితే చట్టపరంగా చర్యలు

మున్సిపల్ ప్రత్యేక అధికారి బి. ఎస్ లత అదనపు కలెక్టర్ జగిత్యాల అదేశాల మేరకు అలాగే మున్సిపల్ కమీషనర్ ఏ. మారుతి ప్రసాద్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోనీ టిఫిన్ సెంటర్లు అలాగే ఇతర దుకాణాలలో అకస్మిక తనిఖీలు నిర్వహించి, వారు వినియోగిస్తున్న సింగల్ యూస్ ప్లాస్టిక్ ను స్వాధీనం పరుచుకొని సుమారుగా 12000 రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచులు వాడాలని తెలిపారు. దీనిని ఉదేశించి మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేదించాలి లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుంది అని వారు తెలపడం జరిగింది. వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను తడి, పొడి, హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలిపారు లేనిచో ఎస్డబ్ల్యుఎం-2019 చట్టం ప్రకారం జరిమానా విధించబడునని చెప్పారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలె అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి.మహేష్, జగదీష్ మున్సిపల్ సిబ్బంది అలాగే జవాన్లు పాల్గొన్నారు.

Change News Type