ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫిజికల్ డైరెక్టర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన బుర్రి సోని రాష్ట్రస్థాయిలో 134 ర్యాంక్ సాధించింది. ఆమె మెట్ పల్లి లోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి, కథలాపూర్ మోడల్ స్కూల్లో ఇంటర్, కోరుట్లలో డిగ్రీ పూర్తిచేసింది. 2020లో బీపీఎడ్ పూర్తిచేసిన బుర్రి సోని ప్రస్తుతం పీడీ ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు