రాయికల్
ఫ్రీ స్కూల్ డే సెలబ్రేషన్స్

viswatelangana.com
April 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ఐసిడిఎస్ జగిత్యాల ప్రాజెక్ట్ రాయికల్ మండలం ఇటిక్యాల న్యూ అంగన్వాడి సెంటర్ 2,4,5 సెంటర్ల ఆధ్వర్యంలో ప్రీస్కూల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల తల్లులకు ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి మరియు ఈవెంట్స్ గూర్చి తెలియజేయడం జరిగింది.. ఐదు నెలల గర్భిణీలకు శ్రీమంతాలు, మరియు ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల తల్లులు మరియు అంగన్వాడి కార్యకర్తలు సిహెచ్ పార్వతి, ఈ సుజాత, ఎం బుజ్జమ్మ, ఏ అనురాధ, ఆయాలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు



