కోరుట్ల
పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అప్పగింత

viswatelangana.com
March 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణానికి చెందిన బొజ్జ నరసయ్య తన ఫోనును గత జనవరి నెలలో కోరుట్లలోని నంది చౌరస్తా సమీపంలో పోగొట్టుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కోరుట్ల పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి అట్టి ఫోన్ ను గుర్తించి సోమవారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎస్సై ఎస్. శ్రీకాంత్ మాట్లాడుతూ ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేస్తే మొబైల్ ఫోను పొందే అవకాశం ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఎవరికైనా మొబైల్ ఫోన్లు, అనుమానిత వస్తువులు ఇతర విలువైన వస్తువులు దొరికితే సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలన్నారు. అంతేకానీ అలాంటి వస్తువులను తమ దగ్గర ఉంచడం వల్ల నేరం అవుతుందని ఎస్ఐ తెలిపారు.



