బండి సంజయ్ పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాయితీ నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేయడం జరిగింది. మండల అధ్యక్షులు నాగరాజు పీసీసీ కార్యవర్గ సభ్యులు తోట్ల అంజయ్య లు మాట్లాడుతూ మతం పేరు సెంటిమెంట్ గా వాడుకుని గెలిచిన తమరు గడచిన ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి కొత్తగా చేసింది ఏముందని ప్రశ్నించారు. కరీం నగర్ పార్లమెంట్ సభ్యునిగా గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎంతో కష్టపడ్డారన్నారు. పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడి పెప్పర్ స్ప్రే దాడిని సైతం తట్టుకొని తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా చేసిన ఘనుడని అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే తమలాంటి దుష్టులను ప్రతి ఒక్క ఓటరు రాముడు అవతారం ఎత్తి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్తారని, ఇకనైనా ఇలాంటి భాషను మానుకొని పద్దతిగా ప్రవర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెలిచాల సత్యనారాయణ, అల్లూరి దేవరెడ్డి, అల్లకొండ లింగ గౌడ్, వెగ్యరపు శ్రీహరి, పుండ్ర నారాయణ రెడ్డి, గోపిడి ధనంజయ్ రెడ్డి, కల్లెడ గంగాధర్, జవ్వాజి ఆదిరెడ్డి, తీపిరెడ్డి ఆనంతరెడ్డి, జవ్వాజి రవి,మదాం శేఖర్, పాల నవీన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



