మేడిపల్లి
మైనర్ బాలుడిని పనిలో పెట్టుకున్న స్వీట్ షాప్ యజమానిపై కేసు నమోదు.

viswatelangana.com
May 10th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి గ్రామంలోని బాలాజీ గణేష్ స్వీట్ షాప్ లో ఒక 14 సంవత్సరాల వయస్సు గల బాలుడు పనిచేస్తున్నాడని సమాచారం మేరకు సురేంద్ర కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, జగిత్యాల తనిఖీ చేయగా అట్టి స్వీట్ షాప్ లో 14 సంవత్సరాల మైనర్ బాలుడు పనిచేయడం గుర్తించి అట్టి స్వీట్ షాప్ ఓనర్ అయిన సురేష్ చోయల్ అనునతడి పై ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై శ్యామ్ రాజ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా షాపు యజమానులు మైనర్ పిల్లల్ని పనిలో పెట్టుకుంటే అట్టి యజమానులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును అని తెలపడం జరిగింది



