హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం కు వినతి పత్రం

viswatelangana.com
టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం కలిసిన తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్ సంఘ నాయకులు.. వారు శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం కు హోం గార్డ్ ల యొక్క సమస్యల గురించి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులు అనారోగ్య కారణాలతోని చాలామంది మరణిస్తున్నారాని, 2016 వ సంవత్సరం నుండి కారుణ్య నియామకాలు నిలిపివేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని, ఇట్టి విషయం ముఖ్యమంత్రితో చర్చించి మాకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, హనుమంత రెడ్డి, తహేర్ బాయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్, జాయింట్ సెక్రెటరీ నారాయణరెడ్డి, పిఆర్ఓ రాజేంద్రప్రసాద్, ట్రెజరర్ గోపాల్ నాయక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్, సీనియర్ హోమ్ గార్డ్ పెద్దలు హైదరాబాద్ సిటీ నూతన అధ్యక్షులు ఏడుకొండలు తదితరులు పాల్గొనడం జరిగింది.



