viswatelangana.com
Date of Publish : 10 April 2024, 1:15 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ గా కాయితి శంకర్ నియమాకం

బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ గా రాయికల్ పట్టణానికి చెందిన కాయితి శంకర్ ను నియమిస్తున్నట్లు బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ నల్ల రాధాకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాయితి శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వివిధ రంగాలలో ఎంతోమంది కృషి చేసినప్పటికీ వారికి సరియైన గుర్తింపు లభించడం లేదన్నారు. బహుజన సాహిత్య అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వివిధ రంగాలలో సేవలు చేసిన వారికి అకాడమీ ద్వారా నేషనల్ అవార్డుతో సమాజంలో సరియైన గుర్తింపు లభిస్తుందన్నారు. తనమీద నమ్మకంతో నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ గా నియమించినందుకు బి.ఎస్ .ఏ నేషనల్ ప్రెసిడెంట్ నల్లా రాధాకృష్ణకు కాయితి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

Change News Type