కథలాపూర్
బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

viswatelangana.com
June 22nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన గోపు మహేష్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించగా శనివారం వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ 5 లక్షల ఎక్స్ గ్రేసియా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి నాగం భూమయ్య,వైస్ ఎంపిపి కిరణ్ రావు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, గడీల గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



