భీమారం
బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది వేలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది

viswatelangana.com
May 14th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమారం మండలం మోత్కరావుపేట గ్రామానికీ చెందిన భూమల్ల గణేష్ దుబాయిలోని అలెన్ ఏరియాలో ప్రమాదవశాత్తు మ్యాన్ హాల్ లో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను బాధితుని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని తాత్కాలిక సహయంగా పదివేల రూపాయలు అందజేశారు. పార్థివ దేహాన్ని తొందరగా తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



