కోరుట్ల

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనలో భాగంగా మౌలిక సదుపాయాలు కల్చిస్తాం.

కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జుహ్వడి నర్సింగరావు

viswatelangana.com

July 6th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

దివంగత దేశ మాజీ ఉప ప్రధాని, స్వాంతత్ర్య సమరయోధులు, సంఘసంస్కర్త డా. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనలో భాగంగా బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించబమే లక్ష్యంగా ముందుకు వెళ్లుతామని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో శనివారం తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులు డా. పేట భాస్కర్ అధ్యక్షతన జరిగిన బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సభలో పాల్గొన్న జుహ్వడి నర్సింగరావు మాట్లాడుతూ మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ దేశంలో అనేక సంస్కరణలకు ఆద్యుడని రక్షణ, కార్మిక శాఖల మంత్రి గా, ఉప ప్రధానిగా తాడిత పిడిత వర్గాల పక్షాన అద్బుతమైన సేవలందించిన మహానీయుడని కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు చేసిన జగ్జీవన్ ఆశయాల కొనసాగింపులో భాగంగా పట్టణంలో ఆయన పెరిట నిర్మాణం జరుగుతున్న పార్క్, మినీ పంక్షన్ హాల్ ఏర్పాటు, పట్టణ ప్రజల అవసరాల రిత్యా వాగు ప్రాంతంలో స్నానాల గదులు నిర్మాణం చేయాలని మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతికి అదేశాలు జారీచేశారు.ప్రజాసంఘాల జేఏసీ, విగ్రహ కమిటీ అధ్యక్షులు పేట భాస్కర్ మాట్లాడుతూ డా. బాబు జగ్జీవన్ రామ్ సేవలకు గుర్తుగా దేశ అత్యున్నత భారత రత్న అవార్డుతో ఆయనను గౌరవించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జగ్జీవన్ మినీ పంక్షన్ హాల్ ఏర్పాటుకు జువ్వాడి నర్సింగరావు తన నిధుల నుండి నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, కాంగ్రెస్, బిజేపి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, అన్నం అనీల్, బింగి వెంకటేష్, కౌన్సిలర్లు మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, బలిజ పద్మ రాజరెడ్డి, ఎం డి సాబీర్, ఎంబే‌రి నాగభూషణం, అడేపు కమల మధు, గంధం గంగాధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొంతం రాజం, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, సంఘ నాయకులు చిట్యాల లచ్చయ్య, శనిగారపు రాజేష్, వుయ్యాల నర్సయ్య,పసుల కృష్ణ ప్రసాద్, మోర్తాడ్ రాజశేఖర్, శనిగారపు మహేష్, చిట్యాల ప్రభాకర్, బెక్కెం అశోక్, చెట్పల్లి లక్ష్మణ్, శోహన్ బాబు, సామల్ల దశరథం, చిట్యాల అశోక్,తాళ్లపెల్లి మహేష్ వివిధ పార్టీల నాయకులు తిరుమల వాసు, ఇందురి సత్యం, ఫహిం, ఆన్వర్, ఎలిశేట్టి గంగారెడ్డి, మ్యాకల నర్సయ్య, మచ్చ కవిత, సదుల వెంకటస్వామి, సత్యనారాయణ, సొగ్రాబీ, ఆమరేందర్, సందీప్, మున్సిపల్ ఎస్ ఐ గజానంద్, సిబ్బంది, వివిధ హోదాలో వున్న పార్టీల పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button