కొడిమ్యాల

చిన్నారి గుండె చికిత్స కోసం ఆర్ధిక సహాయం

మానవతను చాటుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్...

viswatelangana.com

February 10th, 2024
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

కొడిమ్యాల మండల కేంద్రము లోని చిలివేరి‌ నరేష్ శరణ్య‌ దంపతుల కూతురు ధన్విక నాలుగు నెలల పాప కు గుండెకు రంద్రం ఉందని వైద్యులు తెలపగా‌ చికిత్స కోసం హైదరాబాద్ లో తరలించగా దాదాపు పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించగా‌ దాతలు ఎవరైనా ఆదుకోవాలని పాప‌ తల్లిదండ్రులు వేడుకుంటున్న వార్త చూసి చలించిపోయిన‌ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం రోజున కొడిమ్యాల లోని చిలివేరి‌ నరేష్ ఇంటికి వచ్చి‌ పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని నలబై వేల‌ రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు…

రవిశంకర్ మాట్లాడుతూ చిన్నారి గుండె వైద్య ఖర్చుల కొరకు దాతలు ఆదుకొని తోచిన సహాయం చేసి ఆదుకోవాలని పిలుపిచ్చారు..

వారి వెంట తాజా మాజీ సర్పంచ్ లు ఫోరం‌ మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ మేనేని‌ రాజనర్సింగా‌ రావు, వైస్ ఎంపిపి పర్లపల్లి‌ ప్రసాద్, భారాస‌ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,పట్టణ అధ్యక్షులు కొత్తూరి‌ స్వామి, యూత్ అధ్యక్షుడు గడ్డం‌ లక్ష్మారెడ్డి, SC సెల్‌ మండల అధ్యక్షులు నేరెల్ల‌ మహేష్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు శుఖూర్, విధ్యార్థి‌ విభాగం అధ్యక్షుడు అక్బర్, నాయకులు ల్యాగల‌ రాజేశం, కోలాపురం‌ రమేష్, పులి శ్రీనివాస్, దీకొండ‌ చంద్రశేఖర్,అవినాష్ రెడ్డి,చందు,సాగర్, పర్లపల్లి ఆనందం, కాయిత రాజు ప్రభుదాస్, సంతోష్, యువకులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button