మెదక్

బాలికలను అన్నిటింటిలో ప్రోత్సహించాలి- అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్

viswatelangana.com

January 24th, 2024
మెదక్ (విశ్వతెలంగాణ) :

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా సాధికారిత కేంద్రం ఆధ్వర్యం లో రామంచ గ్రామం, చిన్నకొడూర్ మండలము, సిద్ధిపేట జిల్లా నందు జాతీయ బాలిక దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నందు బేటి బచావో బేటి పడావో గోడ పత్రికల ను అవిష్కరణ చేశారు.వివిధ రంగాలలోని విద్యార్థులకు బహుమతులు అందించారుపుట్టిన ఆడపిల్ల పేరు మీదుగా మొక్కలు నాటారు. ఆడపిల్ల పుట్టిన తల్లులకి కృతజ్ఞతలు తెలుపుతూ బాలిక పుట్టుక గొప్పదనాన్ని తెలుపుతూ బట్టలు (బేబీ డ్రెస్, చీర, షాల్వా ) పంపిణీ చేశారు.గ్రామం లో గృహ సందర్శన చేస్తూ భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం గురించి వివరించడం, భేటీ బచావో భేటీ పడావో గోడ పత్రికల ను లు అంటించారు. ఎనీమియా ముక్త్ ప్రోగ్రామ్ లో భాగంగా వైద్య శాఖ ద్వారా నిర్వహించిన కార్యక్రమం లో భాగస్వామ్యం కావడం జరిగింది. ఇందులో గవర్నమెంట్ స్కూల్ ,సిద్దిపేట పాఠశాలలో కిషోర బాలికలకు రక్త పరీక్ష నిర్వహించారు.. సెల్ఫి విత్ డాటర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్య క్రమం లోజిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ జిల్లా సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డి గారు, సిద్దిపేట ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సీ. డీ . పి.ఓ చిన్నకోడుర్ మండల్ యం.పి. డ్డి . ఓ . డిస్ట్రిక్ట్ పంచాయతి ఆఫీసర్ , మెడికల్ ఆఫీసర్ గ్రామ సర్పంచ్ గ్రామ కార్య దర్శి,డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పాటశాల ప్రధానోపాధ్యాయులు ఉపాద్యాయులు ,, డీ .అర్. డి.ఏ,సిబ్బంది,జిల్లా మహిళా సాధికారత కేంద్రం టీం, ఐ .సీ. డి.ఎస్ ,సిద్ధిపేట ప్రోజెక్ట్ అంగన్వాడీ సూపర్వైజర్ లు, ఏ.ఎన్.ఏం ఆశ కార్యకర్తలు, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ గారు,గ్రామ పంచాయతి సిబ్బంది,అంగన్వాడీ కార్యకర్తలు, బాలింత& గర్భవతులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది

Back to top button