కథలాపూర్
బిజెపిలో చేరిన ఊట్ పల్లి నాయకులు

viswatelangana.com
May 11th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో శుక్రవారం రోజున బిజెపి నాయకులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి అద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మీడియా కన్వీనర్ నల్మల రాజు,నాయకులు కొమిరిశెట్టి పెద్ద సాయిరెడ్డి, కొమిరిశెట్టి చిన్న సాయిరెడ్డి బిజెపి పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ సీనియర్ నాయకులు ఏజీబీ నరేష్, గాండ్ల రవి, జవ్వాజి శేఖర్, ఏజీబీ గంగాధర్, వెంకటేశ్వర్లు, చిన్నవేణి సాగర్, ఆనంద్, మనోజ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.



