బిజెపి పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన టూల్ కిట్ల పంపిణీ

viswatelangana.com
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకము లబ్ధిదారులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాయికల్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బుధవారం రోజున విశ్వకర్మ లబ్ధిదారులకు బిజెపి పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని అన్నారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా రాయికల్ పట్టణ లో సుమారు 600 మందికిపైగా కిట్లు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఉచితంగా టూల్ కిట్లు ఇచ్చినందున ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో బన్న సంజీవ్, కడర్ల శ్రీనివాస్, అసరి మల్లేష్ యాదవ్, పటేల్ రాము, తోకల శంకర్, బూత్ అధ్యక్షులు అందె శంకర్, పోస్ట్ మాస్టర్ రాజు, పోస్ట్ మెన్ మధు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



