కోరుట్ల

అమరజీవి దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకై పోరాడుదాం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుతారి రాములు

viswatelangana.com

April 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన నిప్పు కనిక తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకై కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. గురువారం రోజున జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కేంద్రంలోని సి ప్రభాకర్ భవన్లో తెలంగాణ సాయుధ రైతాంగ సమరశీల పోరాటంలో తొలి అమరుడుగా చరిత్రలో నిలిచిన అమరజీవి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రలు పాఠ్యపుస్తకాలలో చేర్చాలని అలాగే కొమరయ్య పేరున యూనివర్సిటీ కి పేరు పెట్టాలని ట్యాంక్ బండ్ పై విగ్రహాలు పెట్టాలని నేటి తరానికి వారి చరిత్ర తెలిపే విధంగా ప్రభుత్వం అధికారికంగా జయంతోత్సవం నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు సి ప్రభాకర్, స్మారక గ్రంథాలయం వృద్ధుల సంక్షేమ సంఘం నేతలు చిన్న విశ్వనాథం, రాస భూమయ్య, రాచకొండ పెద్ద దేవయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు చింత భూమేశ్వర్, గంగాధర్, రావడం అశోక్, గోపం లక్ష్మీనారాయణ, సాంబార్ మహేష్, కొక్కుల గంగాధర్, అందే వంశీకృష్ణ, వడ్లకొండ తుకారం, రామిల్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button