యాదవులకు గుర్తింపు దక్కే వరకు పోరాడదాం
యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్

viswatelangana.com
జనాభా ప్రాతి పదికన యాదవులకు గుర్తింపు ప్రాధాన్యత దక్కే వరకు యాదవులందరం కలిసి కట్టుగా పోరాడదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. సోమవారం మెట్ పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో గ్రామ యాదవ సంఘ సమావేశం నిర్వహించారు.. జిల్లా ముఖ్య సలహాదారులు తొట్ల చిన్నయ్య యాదవ్,తిప్పవేని రవి యాదవ్, అంకం శంకర్ యాదవ్, ముక్కెర లింబాద్రి యాదవ్, గంట రాజేశ్వర్ యాదవ్ లతో కలిసి చౌలమద్ది యాదవ సంఘ సభ్యులతో సమావేశంలో పాల్గొని సభ్యత్వ నమోదు, యాదవుల సమస్యల పరిష్కారం,యాదవులకు దక్కాల్సిన హక్కులు సాదించుకోవడం గురించి చర్చించారు. అనంతరం చౌలమద్ది గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం 68 మంది సభ్యత్వం తీసుకోగ.. జిల్లా, మండల ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్. ఈ కార్యక్రమంలో రాచర్ల మల్లయ్య యాదవ్, మెరుగు భూమయ్య యాదవ్, నాగేల్లి గంగారాం యాదవ్, దశరథ్ యాదవ్ నాగేల్లి సంజీవ్ యాదవ్, కుంభం సాగర్ యాదవ్, వేముల శేఖర్ యాదవ్ తిప్పణవేణి గణేష్ యాదవ్, వేల్పుల అజయ్ యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు..



