కోరుట్ల

యస్ ఆర్ యస్ పి క్యాంప్ గడి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు

viswatelangana.com

March 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ప్రాథమిక పాఠశాల యస్ ఆర్ యస్ పి క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో ముందస్తు హొలీ పండుగను విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ జరుపుకున్నారు. పిల్లలు ఒకరికొకరు ప్రకృతి సిద్దమైన పువ్వుల రంగులు పూసుకొని ఆట, పాటలతో సంబరాలు చేసుకున్నారు. హోలీ పండుగను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై సౌభ్రాతృత్వం సోదరభవంతో కలిసి మెలిసి ఉండాలని ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం అని ఈ విధంగానే కలిసి మెలిసి జీవితంలో ఉండాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ధన లక్ష్మి, సుమలత విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button