రాయికల్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం

viswatelangana.com
March 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాయికల్ సంఘ ఆవరణలో చైర్మన్ శ్రీ ఏనుగు మల్లారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 01-04-2023 నుండి 25-03-2024 వరకు జమ ఖర్చుల వివరాలు సమర్పించడం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ 2022-23 సం. నికి గాను 10% డివిడెండ్ సభ్యుల ఖాతాలో జమ చేయడం జరిగింది అని తెలిపారు. అలాగే ముగ్గురు సంఘ సభ్యులు మరణించినందుకు గాను దహన సంస్కారాల నిమిత్తం ఒక్కొక్కరికి 10000 రూపాయల చొప్పున సమావేశంలో ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో కె డి సి సి బ్యాంక్ మేనేజర్ మార్కండేయ పాక్స్ వైస్ చైర్మన్ బేతి మోహన్ రెడ్డి డైరెక్టర్స్ కుర్మ రాము కొల్ల నారాయణ పాలడుగు నరహింహ రెడ్డి గుండ నరేష్ భేతి లక్ష్మి మండల వసంత బోడ భూమరాజం సీఈఓ ఎలిగిటి రవికుమార్ అసిస్టెంట్ సీఈఓ జగదీష్ మరియు సంఘ సిబ్బంది రైతులు తదితులు పాల్గొన్నారు.



