viswatelangana.com
Date of Publish : 28 August 2024, 1:00 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బీఆర్ఎస్ నేతకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. మొన్నటివరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని… కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయిందని… కేటీఆర్, హరీశ్ లు ఢిల్లీలో బీజేపీ నేతలకు ఆపద మొక్కులు మొక్కారని వ్యంగ్యం ప్రదర్శించారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని అన్నారు.

Change News Type