viswatelangana.com
Date of Publish : 14 September 2024, 2:18 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బీజేపీ సభ్యత్వ నమోదుపై నాయకులు దృష్టి పెట్టండి – చెన్నమనేని వికాస్ రావు

జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై నాయకులు దృష్టి పెట్టాలని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చెన్నమనేని వికాస్ రావు కోరారు. శనివారం కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ప్రతిబూత్ లో 200 మందిని సభ్యత్వం చేయించాలని సూచించారు. వాడ వాడలా బీజేపీ గురించి ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడిపెల్లి గోపాల్ రెడ్డి, కంటె సత్యనారాయణ, బద్రి సత్యం, పూండ్ర ప్రతాప్ రెడ్డి, గాంధారి శ్రీనివాస్, రాచమడుగు వెంకటేశ్వర్ రావు, లక్ష్మీ నర్సయ్య, కాసోజీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type