కోరుట్ల

బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం

తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు

viswatelangana.com

March 27th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

బీడీ కార్మికులకు పెరిగిన కరువు బత్యం ( వీడిఏ) ఏప్రిల్ నెల నుండి అమలు చేయాలని ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలిపారు. గురువారం రోజున బీడి వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాలోని ఆరు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. వినిమయ ధరల పెరుగుదలసూచిక ప్రకారం 14 పాయింట్లు పెరిగింది.ఒక పాయింటుకు పది పైసలు చొప్పున 10.40 పైసలు పెరుగుతుందని అన్నారు దీని ప్రకారం వేయి బీడీలు చుట్టినందుకు మొత్తం 261.97 పైసలు ఏప్రిల్ నెల నుండి అమలు చేయాలని బీడీ యజమానులకు నోటీసుఇచ్చినట్టు తెలిపారు. అలాగే నెలసరి ఉద్యోగులకు చేకర్స్ కు ప్యాకర్స్ కు పెరిగిన కరువు భత్యం చెల్లించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం గౌరవా అధ్యక్షులు ఎండి మౌలానా, ఎండి ముక్కురం, కొక్కుల శాంత, చెన్న విశ్వనాథం, ఎన్నం రాధ, మునుగురి హనుమంతు, వెన్న మహేష్, అందే వంశీకృష్ణ, రాడాం అశోక్, భాగ్య, గంగు, పద్మ, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button