మెట్ పల్లి
బుద్ధ పీస్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ వ్యక్తి.. శ్రీగద్దె నరహరి.

viswatelangana.com
September 18th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామం, విశ్వకర్మ కులానికి చెందిన శ్రీ గద్దె నరహరి మైత్రి స్పేస్ ఇంటర్నేషనల్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుద్ధ పీస్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ వ్యక్తి, శ్రీగద్దె నరహరి మాట్లాడుతూ… తాను చేసిన సేవలకు, గుర్తించిన మైత్రి స్పేస్ ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను చేసిన సేవలకు గుర్తించి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా గర్వకారణంగా ఉందాని, ఇక ముందు కూడా రానున్న కాలంలో యధావిధిగా తాను సేవలు కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ చౌబే (ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు, ఉమాకాంత్ మిత్రుకర్ ( ఐపీఎస్ మెంబర్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ) సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



