కోరుట్ల
కల్లూరు లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం.

viswatelangana.com
March 1st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం కల్లూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, స్వామి వారి కళ్యాణం తో పాటు మహా అన్నదాన కార్యక్రమం కలదు అని మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య తెలిపారు. స్వామి వారి కళ్యాణనికి పరిసర గ్రామాల భక్తులు సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొంతుల దేవేందర్, మాజీ చైర్మన్లు కేతం రమేష్, సిహెచ్ జగన్ రావు, రమేష్, మల్లారెడ్డి, గజం కిషన్, గంగాధర్, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



