రాయికల్
మండల పాఠశాలల క్రీడల ముగింపు

viswatelangana.com
September 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల పాఠశాలల క్రీడల పోటీల్లో భాగంగా చివరి రోజు అండర్ 14మరియు 17 బాల బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ గంగాధర్ తెలిపారు. ఈ మూడు రోజులపాటు జరిగిన క్రీడల్లో విద్యార్థులకు బోజన వసతి కల్పించిన విస్డం స్కూల్, వివేకవర్దిని స్కూల్, విశ్వశాంతి స్కూల్,కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు నీటి వసతి కల్పించిన పి ఆర్ టి యు యూనియన్ రాయికల్ మండల శాఖకు, మచ్చ శేఖర్ లయన్స్ క్లబ్ అధ్యక్షునికి ఎస్ జి ఎఫ్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆటల నిర్వహణలో ఎస్ జి ఎఫ్ మంండల కార్యదర్శి కృష్ణప్రసాద్, పిడిలు గంగాధర్, రాజగోపాల్, సుజాత పి. ఈ. టీ లు పాల్గొన్నారు.



