రైతులకు తలనొప్పిగా మారిన దొంగల బెడద

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఆత్మకూర్ కి చెందిన రైతులు పెగ్గెర్ల గ్రామ శివారులో ఉన్న వరద కాలువకు మోటార్లు పెట్టుకుని పైపుల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ కాలువకు ఊట్ పల్లి, పెగ్గెర్ల, ఆత్మకూరు మూడు గ్రామాలకు చెందిన రైతులు మోటార్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారు. వరద కాలువపై గల మోటార్ల వైర్లు దొంగతనంపై శనివారం నాడు ఫిర్యాదు చేయగా కథలాపూర్ ఎస్ఐ ఆదివారం పెగ్గర్ల శివారు వరద కాలువ మీద ఉన్న మోటార్లని తనిఖీ చేయడం జరిగినది రైతులు మాట్లాడుతూ ఈ దొంగతనం ఇదే మొదటిసారి కాదని ఇదివరకే పలుమార్లు దొంగతనం జరిగిందని పోయినసారి పంటకు వర్షం లేక ఇటు వర్ధకాలువలో నీళ్లు లేక సగం పంట చేతికి రావడం జరిగింది ఈసారైనా దేవుడు కరుణించి మంచిగా పండితే బాగుండు అని కొద్దిగా అప్పుల నుంచి బయటపడవచ్చు అనుకుంటే ఈ దొంగల వల్ల ప్రతిసారి ఇలాగే జరుగుతుందని కొత్త వైర్లు బిగించాలంటే చాలా ఖర్చవుతుందని ఇలా దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని వేడుకున్నారు రైతులతో ఎస్ఐ మాట్లాడుతూ దొంగలపై చర్య తీసుకుంటామని ఇక మళ్లీ అలా జరగకుండా చూస్తామని రైతులకు బరోసా ఇచ్చారు



