డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం
viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గ్రామపంచాయతీ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు నీరటీ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మహిపతి రెడ్డి గ్రామ సేవా సమితి అధ్యక్షులు కంటే విష్ణు మాజీ ఎంపీపీ గంగారెడ్డి మాజీ సర్పంచులు సామల లావణ్య వేణు నారాయణ గౌడ్ గంగారెడ్డి గ్రామ పెద్దలు హిమవంత రావు ఉత్కం సాయ గౌడ్ నారాయణరెడ్డి మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖర్ వేల్పుల లక్ష్మణ్ నాగభూషణం బిట్ల కిరణ్ గుండా గంగారం వేల్పుల హరీష్ కార్యదర్శి రాజేష్ కారోబార్ కిషోర్ నాయకులు యువకులు ప్రజాప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు



