కొడిమ్యాల
భరతమాత చిత్రపటానికిపూలమాల కార్యక్రమం

viswatelangana.com
January 24th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం ధర్మ జాగరణ, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారతమాత పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలుపుతూ మన భారత దేశాన్ని, మన భూమిని భారతమాత గా భావించి పూజ చేయడం సనాతన ధర్మంలో భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ ప్రముఖ సత్తయ్య, మండల ఉప ప్రముఖ్ మంచాల. శ్రీనివాస్, విహెచ్పి మండల అధ్యక్షులు మాణిక్యం శ్రీనివాస్, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, చెన్న దేవేందర్, కంచర్ల గంగాచారి, రామచంద్రం, శ్రీనివాస్, బల్ల అంజయ్య, విహెచ్పి గ్రామ అధ్యక్షుడు ఎర్రోజు శ్రీధర్, ముమ్మడి విజయ్,చెన్న దేవయ్య, రామస్వామి, అడ్లగట్ట రమేష్, బోగ రాకేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



