భరత మాత ముద్దు బిడ్డ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల చత్రపతి శివాజీ మారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని మండల శాఖ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర పలు గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కొడిమ్యాలలో శివాజీ విగ్రహానికి ఎస్సై సందీప్ పూలమాల వేశారు ఈ శోభయాత్రలో 100 మందికి పైగా హిందూ వాహిని కార్యకర్తలు బైకు ర్యాలీగా సూరంపేట చేరుకొని అక్కడి నుండి కోనాపురం, దమ్మయ్య పేట,రాం సాగర్,డబ్బు తిమ్మయ్య పల్లె,నాచుపల్లి, చెప్యాల, నల్లగొండ, తిప్పాయపల్లె, శ్రీరాములపల్లి చేరుకొని అక్కడ శివాజీ విగ్రహానికి పూలమాలు వేసి శోభాయాత్రను ముగించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు వేముల సంతోష్. మండల అధ్యక్షులు తాండ్రియాల బాబు మాట్లాడుతూ శివాజీ జయంతి సందర్భంగా ఈ శోభాయాత్ర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర హిందువుల ఐక్యత కొరకు, హిందూ దేవాలయాల పరిరక్షణ ఆలయాల పవిత్రత కాపాడేందు కొరకు, సమాజంలో ఉన్న సామాజిక రుక్మధులను పోగొట్టెందు కొరకు ఈ హిందూ వాహిని కొన్నేళ్లుగా పని చేస్తుందని, ఈ సంకల్పాల సాధన కోసం ఇంకా నిరంతరంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని మండల అధ్యక్షులు తాండ్రియాల బాబు, మహేందర్ పటేల్, భార్గవ్, బొక్కెన అరుణ్, శ్రీనివాస్, బిజెపి మండల అధ్యక్షులు బండ నర్సింహారెడ్డి, నాయకులు చల్ల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



