భీమారం
ప్రమాదవశత్తు నిప్పంటుకొని ఈత వనం దగ్ధం

viswatelangana.com
May 17th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమారం మండల కేంద్రంలోని గౌడ కులస్తుల యొక్క ఐదేకరాల విస్తీర్ణంలో దాదాపు 3000కు పైగా ఈత చెట్లు పెట్టడం జరిగింది. సుమారుగా అందులో 900కు పైగా చెట్లు కల్లు గీయడానికి ఏపుగా పెరిగినవి. కానీ ప్రమాదవశత్తు నిప్పు అంటుకొని అయిదు ఎకరాలలో ఉన్న మూడువేల పైగా ఈత చెట్లు పూర్తిగా పనికిరాకుండా దగ్ధం కావడం జరిగింది. కళ్ళు గీసుకుని జీవనం సాగిస్తున్న తరుణంలో ఈ విధంగా నష్టం జరగడం వల్ల జీవనోపాధి కోల్పోతామని కాబట్టి ప్రభుత్వం మా గౌడ కులస్తులను ఆదుకోవాలని వారు కోరడం జరిగింది.



