జగిత్యాల

పొలాస లో ఓటు బ్యాంకు రాజకీయం

అవసరం లేని చోట నిధులు రాకున్నా సిసి రోడ్ల నిర్మాణం

viswatelangana.com

October 3rd, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల రూరల్ మండల పరిధిలో గల పొలాస గ్రామంలో కొత్తగా నిర్మించబడిన సిసి రోడ్లు ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఓటు బ్యాంకు రాజకీయం కొరకు చేయబడిందని యువకులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేశారు. బడుగు బలహీనవర్గాలు నివసించే వీధుల్లో ఇప్పటికీ సిసి రోడ్ల నిర్మాణానికి నోచుకోలేదని వర్షాకాలంలో నడవడానికి వాహనాల ప్రయాణానికి చాలా ఇబ్బంది పడుతున్నారని పొలాస గ్రామ ప్రజలు యువకులు విద్యావంతులు రాజకీయ ఉద్దండులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా క్షేత్రస్థాయి అధికారులు ఏఏ వీధులలో సిసి రోడ్ల నిర్మాణం అత్యవసరం ఉన్నదో ఆయా వీధుల్లో యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్ల నిర్మాణం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు

Related Articles

Back to top button