రాయికల్

ఆత్మగౌరవానికి అతివలే ప్రతీక

viswatelangana.com

March 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

భారతదేశంలో ఆత్మగౌరవానికి ప్రతీకగా అతివలు నిలుస్తున్నారని తపస్ రాష్ట్ర అసోసియేట్ ఆధ్యక్షులు అయిల్నేని నరేందర్ రావు అన్నారు. తెలంగాణప్రాంత ఉపాధ్యాయ సంఘం రాయికల్ మండలశాఖ ఆధ్వర్యంలో అల్లీపూర్ గ్రామంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మండలం లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ హైందవ సంస్కృతి మహిళల కు ప్రముఖ స్థానం కల్పించినదని అన్నారు. ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారని తెలిపారు. తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలు అందజేయాలని మహిళా ఉపాధ్యాయులకు సూచించారు. స్త్రీలను గౌరవించే కుటుంబం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జిల్లా అధ్యక్షులు బోనగిరి దేవయ్య మాట్లాడుతూ మన నదీనదాలకు స్త్రీ పేర్లు పెట్టారని చెప్పారు స్త్రీలను గౌరవించడం అనాదిగా వస్తున్న మన ఆచారం అని తెలిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు మహేశ్వర శర్మ జిల్లా బాధ్యులు ప్రవీణ్ రావు మండల శాఖ అధ్యక్షులు కస్తూరి భాగ్యలక్ష్మి ప్రధానకార్యదర్శి యస్ గంగాధర్ నాయకులు బి.మల్లేశం అల్లీపూర్ భూపతిపూర్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కె.శ్రీమతి.రమణీ మూట పెల్లి ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మి దీప వివిధ పాఠశాలల మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Related Articles

Back to top button