జగిత్యాల
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన వారిపై వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పిఎస్ నాయకుల డిమాండ్

viswatelangana.com
January 26th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
26జనవరి గణతంత్ర దినోత్సవ సందర్బంగా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామంలోని వివేకానంద విగ్రహం వద్ద గణతంత్ర వేడుక కార్యక్రమంలో వ్యక్తిగత గొడవలో పడి అంబేద్కర్ యొక్క చిత్ర పటాన్ని అవహేళన చేసిన తాజా మాజీ సర్పంచ్ గెల్లు శేఖర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యాగం అమలు జరిగిన రోజే అంబేద్కర్ ను అవమానించడం చాలా బాధాకరం, వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మోకెనపల్లి సతీష్ మాదిగ,ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి డిమాండ్ చేశారు.. లేదంటే ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు…



