viswatelangana.com
Date of Publish : 09 May 2025, 7:34 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాయికల్ పట్టణంలోని నాగారం హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కశ్మీర్ లో పహాల్గామ్ ఘటన తరువాత ప్రతి భారతీయునిలో ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమ‌న్నారు. భారత సైనిక దళాలు ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో వారికి భారతీయులు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపాలన్నారు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని,ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,కుర్మ మల్లారెడ్డి,ఎలిగేటి అనిల్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, నాయకులు మచ్చ నారాయణ,గాజెంగి అశోక్, వాసం దిలీప్,చింతకుంట సాయికుమార్, బొమ్మకంటి నవీన్,సుమన్,భరత్, మహేష్,పవన్,అశోక్, రంజిత్, వాసం ప్రసాద్ అర్చకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type