మెట్ పల్లి
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

viswatelangana.com
September 1st, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ప్రజలను కోరారు. వాగులు పొంగిపొర్లి, చెరువులు, కుంటలు నిండుకుండలాగా ఉన్నాయీ, కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల వద్దకు పిల్లలు, యువత, జాలర్లు సెల్ఫీ కొరకు, చేపలు పట్టడానికి గోదావరి, వాగులు, చెరువుల వైపు వెళ్ళొద్దని కోరారు. వర్షానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల దృశ్య కరెంటు స్తంభాల దగ్గర కు ఎవరు వెళ్లకూడదని కోరారు.



