viswatelangana.com
September 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి – తాండ్రియాల మధ్యన వేములవాడ రోడ్డు తెగిపోవడం వలనవాహనాలకు ఇబ్బంది జరిగి ఆగిపోవడం జరిగింది. వెంటనే కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది ఇప్పపెల్లి గ్రామస్తుల సహకారంతో లైన్ క్లియర్ చేసి జెసిబి సాయంతో అక్కడ తట్టుకున్న చెత్తని తీసి రోడ్డు కూల్పోయిన దగ్గర పోలీస్ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి వేళలో ప్రయాణం చేసేవారు అక్కడ జాగ్రత్తగా వెళ్లాలని ఎస్ఐ నవీన్ కుమార్ సూచించడం జరిగింది.



