కోరుట్ల
కోరుట్లలో ఘనంగా పాత్రికేయుడి జన్మదిన వేడుకలు

viswatelangana.com
September 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ కెరటం దినపత్రిక జగిత్యాల జిల్లా ప్రతినిధి మిట్టపెల్లి రమణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పాత్రికేయ సోదరులు, ఆత్మీయ మిత్రుల సమక్షంలో శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కటుకం గణేష్, నంద్యాడపు శ్రీనివాస్, కత్తిరాజ్ శంకర్, కోరుట్ల పద్మశాలి సంఘం అద్యక్షులు గుంటుక ప్రసాద్, కోశాధికారి అందె రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎక్కలదేవి రామచంద్రం తదితరులు పాల్గోన్నారు.



