కోరుట్ల

భక్తుల చెంతకే రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు డిపో మేనేజర్ మనోహర్

viswatelangana.com

March 18th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

శ్రీ భద్రాద్రి, సీతారాముల కళ్యాణం ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే ఆర్టీసీ అందజేస్తుందని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. కోరుట్ల డిపోలో తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించినారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ రాములోరి ముత్యాల తలంబ్రాలు బుకింగ్ కోసం భక్తులు కోరుట్ల బస్టాండ్ లోని కార్గో కార్యాలయంలో అలాగే కార్గో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్ వద్ద, ఏజెంట్ ల వద్ద 151/- లు చెల్లించి బుకింగ్ రసీదును పొందాలని తెలిపినారు. సీతారాముల కళ్యాణ అనంతరం భక్తుల ఇండ్లకు తలంబ్రాలను అందజేస్తామన్నారు. స్వామివారి కల్యాణానికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముడి ఆశీస్సులను పొందాలని తెలిపారు. శ్రీ భద్రాచలం రాములవారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలను బుకింగ్ చేసుకోవడం కోసం 9154298572, 9959105928, 9705875757 చరవాణి నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో డిపో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్, ఆఫీస్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button