viswatelangana.com
Date of Publish : 01 May 2024, 3:27 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
భూషణరావుపేట పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2011-2012 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులు 12సంవత్సరాల తరువాత అందరూ కలవడంతో ఎంతో సంతోషం వ్యక్తం పరుస్తూ ఆనాడు చదువుకున్న సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని చదువు చెప్పిన గురువులను మరువకుండా వారి జ్ఞాపకాలను యాదిలో పెట్టుకొని ఎంతో సంస్కారాన్ని నేర్పారని వారి ప్రేరణ మాకు ఎప్పుడు ఉంటుందని పూర్వ విద్యార్థులు మాట్లాడటం జరిగింది.

Change News Type