జగిత్యాల
భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
viswatelangana.com
September 1st, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అధికారులకు సూచించారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. ప్రజలు కూడా వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు, కాలువలు, కుంటలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.



