భూషణరావుపేట లో బడి బాట

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట లో మంగళవారం రోజున గ్రామంలో ఎంఈవో ఆనంద రావు ఆధ్వర్యంలో బడి పిల్లల నమోదుకై బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ప్రభుత్వ ‘బడి బాట’ కార్యక్రమం పాఠశాలలో నాణ్యమైన విద్యనందిస్త పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఎంఈవో ఆనంద రావు తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో గల వసతులపై తల్లిదండ్రులకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అర్జున్ అవగాహన కల్పించారు. భూషణరావు పేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగి విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ భూషణరావుపేట ప్రధానోపాధ్యాయులు రాజయ్య, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విష్ణు, సాయిదివ్య మరియు కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, శ్రీనివాస్, కృష్ణారావు, జగన్, రవి మరియు ఉపాధ్యాయలు నాగరాణి, అరుణ, వాణిశ్రీ, బాలకిషన్, చంద్ర మౌళి, అంజనేయులు, పరంధామ్, కుసుమ నరేష్ తదితరులు పాల్గొన్నారు.



