కోరుట్ల

మంచి నీటి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా నీటి కులాయి నీళ్లు రాని ఇండ్లలో తక్షణమే రిపేర్లు

viswatelangana.com

February 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని మంచి నీటి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా వార్డ్ నెంబర్ 3 సాయిరాం పుర కాలనీ మోర్తాడు లక్ష్మీనారాయణ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ మంచినీటి వినియోగం గురించి ప్రజలకు తెలియజేశారు ఎక్కడైతే నీటి కులాయి నీళ్లు రాని ఇండ్లలో తక్షణమే రిపేర్లు చేస్తూ ఆ ఇళ్లలో మంచినీళ్లు వచ్చే విధంగా పురపాలక సంఘ ఇంజనీరు శ్రీమతి లక్ష్మి మేడం కి తెలియజేస్తూ వారి సిబ్బంది ద్వారా పనులు చేయించడం జరుగుచున్నది అదేవిధంగా నీటి కుళాయిలకు సంబంధించిన బిల్లులు పురపాలక సంఘమునకు చెల్లించి పట్టణ అభివృద్ధి కొరకు పాటుపడాలని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఇంజనీరు శ్రీమతి లక్ష్మి మేడం నీటి కులాయి ఇంచార్జ్ రాజలింగం లైన్మెన్లు మరియు సిబ్బంది వార్డు ప్రజలు జగదీష్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button